calender_icon.png 7 May, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌సీలు ఎన్‌పీడీసీఎల్ యాప్ ద్వారానే ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్ ఉపయోగించాలి

07-05-2025 01:02:57 AM

అశ్వారావుపేట, మే 6 (విజయ క్రాంతి) : విద్యుత్ సిబ్బంది ఎల్ సి లు తీసుకునేటప్పుడు టీ జ ఎన్‌పిడిసి ఎల్ యాప్ ద్వారానే తీసుకోవాలని, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్ తప్పకుండా ఉపయోగించాలని  జిల్లా టెక్నికల్ డి ఈ ఈ  ఎన్ కృష్ణ,  పాల్వంచ డివిజనల్ ఇంజినీర్ పి వి ఎస్ ఎన్ నం దయ లు క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించారు. విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అశ్వారావుపేట ఏ డి ఈ  ఈ వెంకటరత్నం అధ్యక్షతన విద్యుత్ అవగాహన సదస్సు జరిగింది. 

ఈ సదస్సు లో వారు మాట్లాడుతూ లైన్ లో అన్ని రకాలుగా విద్యుత్ సరఫరా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. భద్రతలు పాటించటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు అని తెలిపారు.

అశ్వారావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బి విజయ కుమార్  విద్యుత్ ప్రమాదానికి గురైన సందర్భాల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా సి పి ఆర్ చేసే విధానం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట, దమ్మపేట ఏ ఈ ఈ లు జి రవి, ఏ సాయి కిరణ్ , గండుగులపల్లి ఏ ఈ ఈ రమేష్ సబ్ ఇంజినీర్లు శివ శంకర్, విజయ్ కృష్ణ, సబ్ డివిజన్ పరిధి లోని సిబ్బంది పాల్గొన్నారు.