07-05-2025 01:02:26 AM
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు
వనపర్తి, మే 06 ( విజయక్రాంతి ). : వడ్లు తీసుకునేటప్పుడు తాలు, గడ్డి లేకుండా నిబంధనల ప్రకారం ఉన్నవి వెంటనే తూకం చేసి కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కడుకుంట్ల, చిమనగుంటపల్లి వరి కొనుగోలు కేంద్రాలను, మదనపూర్ గోదాము,వెల్టూర్ వద్ద ఆగ్రోస్, దంతనూర్ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులను తనిఖీ చేశారు.
వరిలో తాలు లేకుండా చూడాలని, అదేవిధంగా పాత గన్ని బ్యాగులు కాకుండా కొత్త గన్నీ బ్యాగులు వాడుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన వరిని మిల్లులకు త్వరగా తరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం అప్పరాల కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో గోదాములో వరి ధాన్యం నిల్వ చేయుటకు గల అవకాశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల తో సమావేశం నిర్వహించారు. ప్రతి సెంటర్ కు లారీలు పెట్టాలని, ధాన్యం తరలింపులో లారీల సమస్య లేకుండా చూసుకోవాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. లేకుంటె కాంట్రాక్ట్ లైసెన్స్ ని రద్దు చేస్తాం అని హెచ్చరించారు.