08-11-2025 12:00:00 AM
కోదాడ (నడిగూడెం), నవంబర్ 7 : గత మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన గ్రామ పంచాయతీ కార్మికుడు మొలుగూరి నరసింహారావు కుటుంబాని తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామంలో మృతుని నివాసం వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికుల ద్వారా సేకరించిన 23 వేల రూపాయలను పంచాయతీ కార్మికులతో కలిసి సిఐటియు నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా నరసింహారావు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ నరసింహారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు షేక్ సుభాని, కార్మికులు చెమట నాగరాజు, చాపల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.