19-07-2025 12:00:00 AM
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి అర్బన్, జూలై 18 (విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.
తన స్వగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. హడావిడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మరోసారి దొంగనాటకానికి తెర లేపారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాత ఆర్డినెన్స్ చేసిన చెల్లెధని మేధావులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు.
ఈ సమావేశంలో పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టగోని గోపి గౌడ్, మాజీ జెడ్పిటిసి మీను కురి రామ్ రెడ్డి, జూకంటి మోహన్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్, నాయకులు కుంభాల రవి యాదవ్, కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.