18-07-2025 11:43:05 PM
కుభీర్,(విజయక్రాంతి): రైతులకు అపూర్వమైన సేవలు అందించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొంది వ్యవసాయ శాఖ మంత్రిచే అవార్డు అందుకున్న తానూర్ మండల కేంద్రంలోని హంగీర్గ సొసైటీ జిల్లాలో ఆదర్శంగా నిలిచిందని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాశెట్టి సాగర రాజన్న కొనియాడారు. శుక్రవారం మండల కేంద్రంలోని సొసైటీలో సీఈఓ భూమయ్యతో పాటు సిబ్బంది పాలకవర్గ సభ్యులను ఆయన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు అందించడంతో పాటు సకాలంలో వ్యవసాయ రుణాలను అందించడంలో పాలకవర్గ సభ్యులతో పాటు సిఈఓ భూమయ్య సిబ్బంది కృషి ఎంతగానో ఉందన్నారు. వారందరినీ అభినందించి స్వీట్లు తినిపించారు. అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరుగుతుందని రైతులకు విస్తృతంగా సేవలందించి వారి మన్ననలను పొందాలని కోరారు.