19-07-2025 12:00:00 AM
వనపర్తి, జూలై 18 ( విజయక్రాంతి ) :ఏదుల మండల కేంద్రంలో నూతన వ్యవసా య గోదాంల నిర్మాణానికి శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదివేల మెట్రిక్ టన్నుల సా మర్థ్యం గల గోదాంల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ గోదాంలా ని ర్మాణం తో ఏదుల , గోపాల్ పేట్, రేవల్లి, మండలంలోని రైతులలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందనిఇందుకు సంబంధించి న భూ సేకరణను త్వరిత గతినపూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకు లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.