calender_icon.png 30 September, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షబ్బీర్ అలీని సన్మానించిన నాయకులు

30-09-2025 12:00:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీటౌన్ అధ్యక్షులు సీతారాం మధు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి శాలువతో సన్మానించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి,  సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, కార్గే, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలిని శాలువాతో వారు సన్మానించారు.