16-08-2025 12:00:00 AM
తాడ్వాయి, ఆగష్టు, 15( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన కొందరు బిజెపి నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తాము స్పందించి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. చేరిన వారిలో మధుసూదన్ రెడ్డి,పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు సుధాకర్ రావు,గైని శివాజీ, మోహన్ రెడ్డి, రాజు,జలంధర్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.