29-01-2026 12:02:28 AM
ఘట్ కేసర్, జనవరి 28 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలని, పలు ప్రధాన ప్రజా సమస్యల మీద పోరాటం కొరకు బుధవారం జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ పరిధిలోని సంస్కృతి కాలేజ్, బృందావన్ కాలనీలలో ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో గడప గడపకు కరపత్రాల పంపిణీ చేస్తూ పలు సమస్యల పై కాలనీ వాసులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగభూషణం, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్, కూసపాటి పద్మారావు, సార శ్రీనివాస్ గౌడ్, బృందావన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.