calender_icon.png 29 January, 2026 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

29-01-2026 12:02:19 AM

నల్లగొండ టౌన్ , జనవరి 28: నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో పక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుసరిస్తున్న విధానం, ప్రవేశనిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు, పోలీస్ బందొబస్త్, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని, అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, జెండాలు, బ్యానర్లు ప్రదర్శించడం, ర్యాలీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ధ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, ప్రత్యేక గస్తీ బృందాల ఏర్పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతిని ధులు పోలీస్ శాఖకు సహకరించాలని, ఎన్నికల నియమాలను గౌరవించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,ఎస్.బి సీఐ రాము, 2 టౌన్ ఎస్‌ఐ సైదులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.