calender_icon.png 29 January, 2026 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయశంకర్ జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని మానుకోండి

29-01-2026 12:03:08 AM

  1. అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి
  2. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
  3. భూపాలపల్లిలో ఉభయ కమ్యూనిస్టులతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ(భూపాలపల్లి)/జనవరి 28(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని మానుకోండని  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉ భయ కమ్యూనిస్టు నేతలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్, పట్టణ అధ్యక్షుడు ఇతర ముఖ్య నేతలతో విలేకరుల సమావేశంను నిర్వహించా రు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ గడిచిన రెండేళ్ల సమయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో సు మారు రూ.350 కోట్లకు పైగా నిధులతో ప లు అభివృద్ది పనులు చేపట్టామని అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు నేతలు తప్పుడు ఆరోపణ లు చేస్తున్నారన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందని కొంతమంది నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ జిల్లా మారితే నేను(ఎమ్మెల్యే) రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి, 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవడం ఖాయమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంటే, మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. 

అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహా లు ఉంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరో పణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే ఆగ్ర హం వ్యక్తం చేశారు. భూపాలపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకోవాలని కోరారు.