calender_icon.png 13 October, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంపూర్ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు

13-10-2025 12:56:35 AM

అలంపూర్, అక్టోబర్ 12: అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరైనట్టు టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ తెలిపారు. అలంపూర్ లో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.

ట్టణంలోని పాత ఆర్డీఎస్ కార్యాలయం నుండి న్యూ ప్లాట్స్ కాలనీ, పాత రిజిస్ట్రేషన్  కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ డివైడర్ సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు, అలాగే వర్షపు నీటితో ఇబ్బంది పడుతున్న అక్బర్ పేట కాలనీలో నూతన సిసి రోడ్డు మంజూరు అక్కడి నుంచి పాపనాశి ఆలయానికి వెళ్లే దారి వాగుపై నూతన బ్రిడ్జి, పట్టణంలో ప్రధాన సర్కిల్ విస్తరణ సుందరీకరణ పనులు,

వివిధ వార్డుల్లోని నూతన సిసి రోడ్లు అంబేద్కర్ కాలనీ నందు వడ్డె గుంతలో విశాలమైన సుందరీకరణ పార్కు ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగిం చనున్నట్లు తెలిపారు. నిధుల మంజూరులో ప్రత్యేక చొరవ చూపిన సంపత్ కుమార్ కి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.