11-08-2025 12:00:00 AM
ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నా కూడా ఏం జీవితం ఇది.. దేనినీ నిలబడి తేరిపారచూడడానికి మనకు సమయం ఉండడం లేదు. చెట్లకొమ్మల కింద నిలబడడానికీ, ఆ గొర్రెలనూ, ఆవులనూ చాలాచాలా సేపు తేరిపారచూడడానికి సమయం ఉండడం లేదు.
అడవుల గుండా మనం వెళ్తూన్నప్పుడు ఉడుతలు వాటి తిండిగింజలను గడ్డిలో ఎక్కడ దాచిపెట్టుకుంటున్నాయో చూడడానికి సమయం ఉండడం లేదు. మిట్టమధ్యాహ్నపు విశాలవిస్తారకాంతిలో రాత్రివేళప్పటి ఆకాశాల వలెనే ఉన్న తళతళల నక్షత్తపూర్ణభరిత ప్రవాహనదులనూ చూడడానికి సమయం ఉండడం లేదు.
సౌందర్యం యొక్క క్షణమాత్రదర్శనం దిక్కు మరలిరావడానికీ, ఇంకా ఆమె పాదాలనూ, అవి ఎట్లా నాట్యం చేయగలవో పరీక్షగా చూడడానికి సమయం ఉండడం లేదు. ఆమె మోమును సంపన్నం చేయగలిగే చిరునవ్వు అది ఆమె కళ్ళూ ప్రారంభించేసేంత వరకూ వేచిచూడడానికీ సమయం ఉండడం లేదు.
ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నా కూడాఏం దీనబీద జీవితం ఇది.. దేనినీ నిలబడి తేరిపారచూడడానికిమనకు సమయం ఉండడం లేదు!!!
ఆంగ్ల మూలం: విలియం హెన్రీ డేవీస్
స్వేచ్ఛా కవితానువాదం: రఘువర్మ