26-08-2025 03:10:15 AM
తక్షణమే బకాయిలు విడుదల చేయాలి
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం
ఖైరతాబాద్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): గత ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్‌ను తక్షణమే విడుదల చేయాలని తెలం గాణ రాష్ర్ట రేషన్ డీలర్లు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రేషన్ డీలర్లు ధర్నా చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ లోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ముందు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పౌరసరఫరాల శాఖ జాయింట్ కమిషనర్ కు సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాయికోటి రాజు, సంజీవరెడ్డిలు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 17,200 మంది రేషన్ డీలర్లకు కమీషన్లు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమకు కమీషన్ విడుదల చేయాలని లేని పక్షంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్ షాపులు మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.