calender_icon.png 8 July, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం

23-06-2025 05:58:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తుందని ప్రజలు కూడా సహకరించి మత్తు పదార్థాల నియంత్రణ ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) అన్నారు. సోమవారం మత్తు పదార్థాల నియంత్రణ వారోత్సవాల పుస్తకం కొని పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో మత్తు పదార్థాల నేతలకు పోలీస్ శాఖ నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తుందని యువత దాని బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి రాకేష్ మీనా సిఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.