calender_icon.png 18 January, 2026 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిపుత్రుల వేడుక చూసొద్దాం!

18-01-2026 01:59:33 AM

  1. గిరిజనులు సంప్రదాయాల వేదిక నాగోబా జాతర
  2. నేటి అర్ధరాత్రి నాగోబాకు మహా పూజలతో జాతరకు శ్రీకారం

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 17 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకునే నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఏటా ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మహా పూజలతో మెస్రం వంశస్థులు జాతరను ప్రారంభి స్తా రు. నాగోబా పూజలకు డిసెంబర్ 22వ తేదీన మహా పూజలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 30వ తేదీన మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులోని గోదావరి నదిలోని పవిత్ర గంగా జలం కోసం మెస్రం వంశీయులు మహా పాదయాత్ర చేపట్టారు. జనవరి 7వ తేదీన గంగా జలాన్ని సేకరించి, ఈ నెల 14న కేస్లాపూర్ మరి చెట్ల వద్దకు చేరుకు న్నారు.

మహా పూజలకు మెస్రం వంశం మహిళలు గానుగలో తీసిన నువ్వుల నూనె ను దీపాలకు ఉపయోగిస్తారు. నాగోబా మహా పూజల రోజున ఉద యం ఆలయం పక్కన మట్టి పుట్టలను మెస్రం వంశం ఆడపడుచులు, మెస్రం వంశం మహిళలు ప్రత్యేకంగా పుట్టలను తయారు చేస్తారు. ఈ పుట్టలకు మట్టి కుండలతో కోనేరు నుంచి తీసుకువచ్చిన నీటితో మట్టిని బురద చేసి పుట్టలు తయారు చేస్తారు. పుట్టలు తయారు చేసిన తర్వాత ఏడాది పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశీలిస్తుంటారు.

మెస్రం వంశంలోని 22 తెగలవారు కు టుంబ సమేతంగా ఎడ్లబండ్లతో తరలివచ్చి నాగోబా సన్నిధిలోని మర్రి చెట్ల వద్ద సేద తీరుతారు. మట్టి కుండలో దేవుడికి జొన్న గడక, సాంబారు నైవేద్యంగా సమర్పించి సహా పంక్తి భోజనం చేస్తారు. నాగోబాకు మహా పూజ అనంతరం ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాల ప్రకా తెల్లవారుజాము న మెస్రం వంశం కొత్త కోడళ్ల నాగోబా సన్ని ధిలో బేటింగ్ (పరిచయం) అవుతారు.