calender_icon.png 11 May, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశాంతిని వీడి అద్భుతాలు సాధిద్దాం!

21-08-2024 12:30:00 AM

నేటి యువతరం అనంత విశ్వమే హద్దుగా కృత్రిమమేధ వంటి సాంకేతికతతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందన్నది. కానీ, కొన్ని సందర్భాల్లో ఐఐటీ, మెడిసిన్, విశ్వవిద్యా లయాల స్థాయిలో ఉన్నత విద్యను అ భ్యసించిన ప్రతిభావంతులైన విద్యార్థులతోపాటు సామాన్యులు సైతం జీవి తంలో ఎదురయ్యే వివిధ రకాల శారీర క, మానసిక ఓటములను, సమస్యల ను తట్టుకోలేక డిప్రెషన్‌కు లోనవుతున్నారు. కాల పరిణామ క్రమంలో వస్తు న్న మార్పులను స్వాగతించలేక ఆత్మవిశ్వాసం కోల్పోతున్న వారెందరో. పెద్ద రికపు అహంకారం పేరుతో వారం తా ఈ పోటీ ప్రపంచంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

జీవితం విలువ తెలుసుకోలేక కొన్ని క్షణిక నిర్ణయాలు తీసుకొని తమతోపా టు తమ కుటుంబాలకూ తీవ్ర సంఘర్షణలను మిగులుస్తున్నారు. నవతరం ప్రపంచాన్ని ప్రభావితం చేసి న మహానుభావుల జీవితచరిత్రలను చాలా మంది చదవడం లేదు, తెలుసుకోవ డం లేదు. విద్యాసంస్థల్లో కూడా మా ర్కులు, గ్రేడుల చాటున వ్యక్తిత్వపు పా ఠాలకు సమయం లేదు. చరిత్రను ప్ర భావితం చేసిన అసాధారణ వ్యక్తు లు కూడా మనలాంటి సాధారణ వ్య క్తులేనని, వారు కూడా తమ జీవితంలో ఎ న్నో సమస్యల్ని అధిగమించారని, మొ క్కవోని దీక్షతో నిరంతరం ప్రయత్నించి వైఫల్యాల నిశ్శబ్దం మాటున గెలుపు శబ్దమై మిగిలారని, వెలుగు దివ్వెలై నేడు ప్రకాశిస్తున్నారని తెలుసుకోవాలి.

స్టీఫెన్ హాకింగ్స్..

చాలా శరీర అవయవాలు పనిచేయక పోయినప్పటికీ కొన్ని దశాబ్దాలు గా తన జీవితం వీల్‌చైర్‌కే పరిమితమై అద్భుతాలు సాధించిన స్టీఫెన్ హాకింగ్ జీవన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ విశ్వం ఎంత పెద్దదైనా కావ చ్చు కానీ, మన ప్రయత్నాల ముందు చాలా చిన్నదనే హాకింగ్ తన అసాధారణ మేధాసంపత్తితో బ్లాక్ హోల్స్‌పై చేసిన పరిశోధనలు నేటి ఆధునిక సైన్సుకు, సైంటిస్టులకు సవాళ్లుగా మా రాయి.

‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పేరుతో ఆయన రాసిన పుస్తకం నేటి బెస్ట్ సైన్స్ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. అనంత విశ్వావిర్భావం నుంచి ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటి సూక్ష్మపరమా ణు కణాల వరకు సైన్స్ ప్రస్థానాన్ని హైస్కూల్ విద్యార్థులకు కూడా అర్థమ య్యే రీతిలో అందులో ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం ఏనాటికీ వైఫల్యం కాదనే పాఠంతో కోట్లమందికి స్ఫూర్తి పాఠ్యాంశంగా ఆయన జీవితగాథ ఉంది.

గాంధీజీ

పెద్దగా అసాధారణ నైపుణ్యాలు లే ని బక్కపలుచని గాంధీ 34 కోట్లమంది భారతీయులను ఏకతాటిపై నిలిపారు. అహింస, సత్యాగ్రహాలతో ఆయన చేసి న ఆధ్యాత్మిక రాజకీయ పోరాటం మ న దేశానికి స్వాతంత్య్రం సంపాదించడమేకాక విశ్వవిఖ్యాత మేధావుల జీవితా లనే కదిలించింది. ఈ శతాబ్దపు అత్యున్నత వ్యక్తుల్లో ప్రముఖుడ్ని చేసింది. ఐన్‌స్టీన్, స్టీవ్ జాబ్స్, దలైలామా, సీవీ రామన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా వంటి సుప్రసిద్ధులకే గాంధీ జీవితం స్ఫూర్తిగా నిలిచింది. ఆయన జీవితంపై వచ్చిన ‘గాంధీ’ సినిమా విశేష ప్రాచుర్యం పొం ది, ఆస్కార్ అవార్డుల పంట పండించింది. గాంధీజీ సూక్తులు భవిష్యత్తు తరాలకు జీవిత బాటలయ్యాయి.

నెల్సన్ మండేలా

దక్షిణాఫ్రికా ప్రజల స్వాతంత్య్రం కో సం దాదాపు 27 సంవత్సరాల జైలు జీవితం అనుభవించి ‘ఎ లాంగ్ వాక్ టూ ఫ్రీడం’ పేరుతో తన జీవిత చరిత్ర రాసిన నెల్సన్ మండేలా నల్లజాతి విప్లవ సూర్యుడయ్యాడు. ఐక్యరాజ్యసమితి ఆయన జయంతిని ‘మండేలా డే’గా  ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుం ది. ఆయన అనుసరించిన క్షమాగుణం, సహనం, శాంతి వంటి మార్గాలు నేటి తరానికి విజయ సోపానాలు. 

మేడం క్యూరీ

మహిళవు కాబట్టి ఉన్నత విద్యకు అ ర్హురాలివి కావని, పరిశోధనలకు అవకాశం ఇవ్వలేమంటూ అవహేళనలను భరించిన మేడం క్యూరీ తన అసాధారణ ప్రయత్నాల పట్టుదల పరంపర లో భౌతిక, రసాయన శాస్త్రాల్లో రెండింటిలో నోబెల్ గెలిచిన ఏకైక వ్యక్తిగా నిలి చింది నేటికి. రేడియో ధార్మికత అంశం పై ఆమె చేసిన ప్రయోగాల ఫలితాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల ను తెచ్చాయి. ఆనాటి ప్రఖ్యా త భౌ తిక, రసాయన శాస్త్రవేత్తలకేకాక నేటి తరంలోనూ ఆదర్శాలయ్యాయి.

ఇంకా ఎందరో..

బల్బును కనుగొనే ప్రయత్నంలో వందలసార్లు పట్టు వదలకుండా కృషి చేసి ప్రపంచానికే వెలుగునిచ్చిన థామ స్ అల్వా ఎడిసన్, నిరుపేద కుటుంబంలో పుట్టి అడుగడుగునా వివక్షతకు లోనై పట్టుదల వదలకుండా విశ్వమేధావిగా ఎదిగిన భారతరత్న అంబేద్క ర్, రామేశ్వరం వీధుల నుంచి అంతరిక్షంలోని ఓ మిస్సైల్‌లా మారి, రాష్ట్రప తి భవన్ వరకు సాగిన అబ్దుల్ కలాం సుదూర స్ఫూర్తి ప్రయాణం ఇంకా స చిన్ టెండూల్కర్, మహీంద్ర సింగ్ ధో నీ, అమితాబ్ బచ్చన్, ఆంగ్ సాన్ సూ కీ, కల్పనా చావ్లా, మదర్ థెరిస్సా, సు ధా మూర్తి వంటి ప్రముఖుల జీవిత చరిత్రలు మన జీవితాలకు మార్గదర్శనం చేస్తూనే వుంటాయి.

- ఫిజిక్స్ అరుణ్ కుమార్