calender_icon.png 22 January, 2026 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

22-01-2026 12:38:26 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి, జనవరి 21 (విజయక్రాంతి):రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపల్ లో  కామారెడ్డి మున్సిపల్  పరిధిలో వార్డులు 49, బిచ్కుంద  మున్సిపల్ పరిధిలో 12 వార్డులు, బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 19  వార్డులు, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 12 వార్డులలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పోలింగ్ కేంద్రాలు కామారెడ్డి 152, ఎల్లారెడ్డి 24, బాన్సువాడ 39, బిచ్కుంద 24 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు  నామినేషన్ కేంద్రాలలో CC కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి కామారెడ్డి , ఖమ్మం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎన్నికల అధికారులు/కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.