22-01-2026 12:37:35 AM
డీఎస్పీ రవీందర్ రెడ్డి
శేషగిరినగర్‌లో పోలీసుల తనిఖీలు
41 ద్విచక్ర వాహనాలు సీజ్, బెల్ట్ షాప్‌లపై రైడ్
మణుగూరు, జనవరి 21 (విజయక్రాంతి): నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరినగర్‌లో డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ఇంట్లోని వ్యక్తుల వివరాలను సేకరించారు. వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. సరైన ఆధారాలు చూపని 41ద్విచ క్ర వాహనాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేరనిర్మూలన సాధ్యమన్నారు. కాలనీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాలనీల స్వీయ రక్షణ కోసం సీసీ కెమె రాలను ఏర్పాటు చేసుకోవాలని, దీనికి పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ పాటి నాగబాబు, ఎస్ ఐ లు నగేష్ కుమార్, శ్రావణ్ కుమార్, సురేష్, ఏఎస్‌ఐ శాంతి,ఝాన్సీ, హెడ్ కానిస్టేబుల్ షరీఫ్, కానిస్టేబుల్ లు బుచ్చి బాబు, ము రారి, సత్యనారాయణ, ప్రసా దు, రామారావు, రామకృష్ణ, సైదులు, రాజగోపాల్ పాల్గొన్నారు.