06-12-2024 12:00:00 AM
తెలంగాణలోని ములుగు జిల్లాలో బుధవారం ఉదయం 7.27 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకం పం సంభవించినట్లు ‘నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ’ తెలిపింది. అనేక జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. నివాసితులు భవ నాలను ఖాళీ చేయవలసి వచ్చింది.
దీనివల్ల ఆస్తి నష్టం గాని, ప్రాణనష్టం గాని సంభవించలేదు. అయితే, చాలామంది ఈ భూకం పం వచ్చినట్లుగా కూడా గమనించలేదు. ఇండ్లలో ఉన్నవారు ఏదైనా పని చేసుకుంటున్న వారు భూకంపాన్ని గమనించలేదు. కుదురుగా ఒక ప్రాంతంలో కూర్చున్న వ్యక్తు లు తాను కూర్చున్న ప్రదేశం కదులుతున్నట్లుగా గమనించి భూకంపం సంభవించిన ట్లు ఇంట్లోవారిని పిలిచి బయటికి పరుగులు తీశారు.
భూకంప తీవ్రత 5.3గా ఉండడం పెద్దగా ఏర్పడక పోయినప్పటికీ వైబ్రేషన్‌తోపాటు శబ్దమూ సంభవించింది. భూభౌతిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం తెలంగాణ జోన్ రెండులో ఉందని పెద్దగా ప్రమాదం సంభవించక పోవచ్చని, అయితే మళ్లీ సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని భూభౌతిక శాస్త్రవేత్తలు అంటున్నారు.
తెలంగాణలో సుమారు 55 ఏండ్ల తర్వాత సంభవించిన రెండో అతిపెద్ద భూప్రకంపనగా ములుగు విపత్తును నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, చరిత్రలో ప్రపంచాన్ని కుదిపిన 10 అతిపెద్ద భూకంపాలలో చివరిది ‘అస్సాం టిబెట్’ 15 ఆగస్టు 1950 ( 8.6).ఈ లోతట్టు భూకంపం వల్ల భవనాలకు విస్తృతంగా నష్టం వాటిల్లడంతోపాటు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. తూర్పు టిబెట్‌లో 780 మంది మరణించా రు.
అస్సాం, చైనా, టిబెట్, భారతదేశం అంతటా అనేక గ్రామాలు, పట్టణాలు దీనికి ప్రభావితమయ్యాయి. సరస్సు స్థాయిలకు డోలనాలు నార్వేవరకు సంభవించాయి. ఆ భూకంపాన్ని ‘అస్సాం భూకంపం’ అనే పిలుస్తారు. ఈ భూకంప కేంద్రం టిబెట్‌లో ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
చెట్లు కూలిపోవడమూ ఒక సంకేతమా?
అయితే, భూమి పొరలలో సంభవిస్తున్న గ్యాప్‌వల్ల, రాళ్లలో ఏర్పడే కదలికలవల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంద ని, ముఖ్యంగా మానవ తప్పిదం కారణంగా భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఎక్కువ లోతునుండి అత్యధికంగా వనరులను, నీటిని తోడేయడం వల్ల నేల అంతర్భాగంలో ప్రకంపన లు సంభవిస్తాయన్నది వాస్తవం.
ఇదీ ఒక ప్రకృతి వైపరీత్యామే. భూకంపాలు సంభవించకుండా తీసుకోవలసిన చర్యలను సరి గ్గా పాటించకపోవడమూ ఒక తప్పిదమేనని పర్యావరణ భూశాస్త్రవేత్తలు అన్నారు. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ఇప్పటికే దేశమంతటా అధ్యయనం జరిపి, ఏయే ప్రాంతాలలో భూకంపాలు, ప్రకంపనలు సంభవించే ప్రాంతాన్ని గుర్తించారు.
వీటిని జోన్ల వారీగా విడదీసి ఉంచారు. అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే గత సెప్టెంబర్ 4న ములుగు అటవీ ప్రాంతంలో 50 వేల చెట్లు వేళ్ళతో పెకిలించినట్లుగా పడిపోయాయి.
దీనికి కారణం అప్పట్లో ఎవరికీ అర్థం కాలే దు. భూప్రకంపనుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తర్వాత శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రస్తుతం జరిగిన ప్రకంపనలు అదే ప్రాంతంలో జరగడం గమనార్హం.
ముందస్తు హెచ్చరికలు కష్టమే
భూకంపాల తీవ్రతను, నష్టాన్ని ముందు గా అంచనా వేసినా ప్రజలను అప్రమత్తం చేసే స్థాయిలో మనకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటులో లేదని చెప్పా లి. ప్రకృతి వైపరీత్యాల నివారణకు ముఖ్యం గా తుపానులు సంభవించినప్పుడు వాతావరణ శాఖవారు ఇస్తున్న సూచనల మేరకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉంటుంది.
కానీ, భూకంపాలు అలా కాదని, ఇవి ఎప్పుడు సంభవిస్తాయో చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా, బహుళ అంతస్థుల అపార్ట్మెంట్లు, భారీ ఫ్యాక్టరీలు, మాల్స్, సూపర్ మార్కెట్లతోపాటు గిడ్డంగులు, రాతి భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
అసంఖ్యాకంగా అశాస్త్రీయ నిర్మాణాలతో -ఒక రకంగా దేశం అధిక ప్రమాదంలో ఉందనే చెప్పాలి. గత పదిహేనేళ్లలో దేశం 10 పెద్ద భూకంపాలను చవిచూడగా, దీని ఫలితంగా 20,000 మందికి పైగా మరణించారు. దేశం ప్రస్తుత సీస్మిక్ జోన్ మ్యాప్ (ఐఎస్1893: 2002) ప్రకారం భారతదేశ భూభాగంలో 59 శాతానికి పైగా భూకంప ప్రమాదాల ముప్పులో ఉంది-. అంటే, ఇది ఎంఎస్‌కె తీవ్రత 7, అంతకంటే ఎక్కువ (బీఎంటీపీసీ 2006) వణుకుతున్నట్లు అర్థం.
వాస్తవానికి, మొత్తం హిమాలయ బెల్ట్ 8.0- కంటే ఎక్కువ తీవ్రతతో కూడిన భారీ భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. దాదాపు 50 సంవత్సరాల సాపేక్షంగా తక్కువ వ్యవధిలో, అటువంటి నాలుగు భూకంపాలు సంభవించాయి: 1897 షిల్లాంగ్ (ఎం 8.7), 1905 కాంగ్రా (ఎం 8.0), 1934 బీహార్- నేపాల్ (ఎం 8.3), 1950 అస్సాం- టిబెట్ (8.6). హిమాలయ ప్రాంతంలో చాలా తీవ్రమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రీయ ప్రచురణలు హెచ్చరించాయి. ఇది భారతదేశంలోని అనేక లక్షల ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అంశం.
మహానగరాలకూ ముప్పు తప్పదా?
ఒకప్పుడు దేశంలోని హిమాలయాలకు దూరంగా ఉన్న ప్రాంతాలు, ఇతర ఇంటర్-ప్లేట్ సరిహద్దులు భూకంపాల నుండి సాపేక్షంగా, సురక్షితంగా పరిగణించబడ్డాయి. కానీ, ఇటీవలి కాలంలో ఈ ప్రాం తాలు కూడా హిమాలయ భూకంపాలకం టే తక్కువ తీవ్రతతో ఉన్నప్పటికీ, వినాశకరమైన భూకంపాలను చవిచూశాయి.
పట్టణీ కరణ, ఆర్థికాభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవ స్థ ప్రపంచీకరణ ద్వారా నడపబడుతున్న అభివృద్ధి కార్యకలాపాలలో పెరుగుదల కారణంగా భూకంప ప్రమాదం పెరుగుతున్నది. తయారీ, సేవా పరిశ్రమలలో హైటె క్నాలజీ పరికరాలు, సాధనాల వినియోగం పెరగడం వల్ల సాపేక్షంగా మితమైన భూమి వణుకు కారణంగా అవి అంతరాయానికి గురయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
తత్ఫలితంగా, మానవ ప్రాణనష్టం మాత్రమే భూకంప ప్రమాదాన్ని నిర్ణయించదు. భూకంపం తర్వాత స్థానిక లేదా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీసే తీవ్రమైన ఆర్థిక నష్టాలు మొత్తం దేశానికి దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలను కలిగిస్తాయి. భూకంపం ఢిల్లీ లేదా ముంబై వంటి మెగా-సిటీలను ప్రభావితం చేస్తే ఈ ప్రభావం మరింత పెరుగుతుంది.
ఏది ఏమైనా ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా భూకంపాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న మానవ తప్పిదాలు, విధానాల వల్ల అంతర్జాతీయంగా సంభవిస్తున్న విపత్తులు ఎన్నో. దేశంలో గుజరాత్ లాతూర్ ప్రాంతాలలో సంభవించిన భూకంపం (1993) చాలా పెద్దదిగా చెప్పవచ్చు.
అయితే, రానున్న రోజులలో మరిన్ని భూకంపాలు సంభవించే ప్రమాదాలు లేకపోలేదని భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏమైనా, ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ప్రభుత్వాలు ఏ రకంగా మేల్కొని, తగు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది.
-డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి