24 March, 2026 | 10:04 AM

భగత్‌సింగ్ ఆశయాల సాధన కోసం కృషి చేద్దాం

24-03-2026 12:10 AM

ఎర్రుపాలెం మార్చి 23( విజయ క్రాంతి):  దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే పోరాడిన ధీరుడని రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య, డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకరరావు  పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామ్ శెట్టి పుల్లయ్య భవనం నందు ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ భగత్ సింగ్ 95వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మతాలు కులాల మధ్య చిచ్చుపడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు దివ్వెల వీరాంజనేయులు ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు సాయి కొండపాటి నరేంద్ర కొమ్మూరి నరేష్ నాయిని అక్షయ్ ,గణేష్ శీలం జగన్మోహన్ రెడ్డి కోట శ్యాంబాబు పాల్గొన్నారు.