24 March, 2026 | 3:27 AM

రైల్వే కార్యకలాపాల భద్రతపై ప్రత్యేక దృష్టి

24-03-2026 12:11 AM

సికింద్రాబాద్, మార్చి 23(విజయక్రాంతి):  రైల్వే కార్యకలాపాల భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దక్షిణ మధ్య  జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో అధికారులతో కలసి రైళ్ల కార్యకలాపాల భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ట్రాక్‌ల భద్రతను మరింత బలోపేతం చేయడం, పాయింట్లు అండ్ క్రాసింగ్లు, భద్రతా అలారమ్ల వద్ద చేపట్టాల్సిన తనిఖీలు, భద్రతా డ్రైవ్ల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. రైల్వే ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా పరికరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ఉన్న తాధికారులు తదితరులు పాల్గొన్నారు.