28-12-2025 12:00:00 AM
* ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్
చేగుంట, డిసెంబర్ 26 : కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమించాలని, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో ఉన్న ఆయన సమాధి వద్ద 65వ వర్ధంతి పురస్కరించుకొని అయన సమాధికి పూల మలవెసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్బంగా తాను మాట్లాడుతూ కేవల్ కిషన్ పేద ప్రజల హక్కుల కోసం, పోరాటం చేసా రు అని. భూస్వాముల గుండెల్లో దడ పు ట్టించి, రైతుల హక్కుల కోసం తన ప్రా ణాలను అర్పించిన మహనీయుడు కామ్రేడ్ కేవలం కిషన్ ముదిరాజ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్యదర్శి,జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు, మండలం ఉన్న వివిధ గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.