calender_icon.png 27 December, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు నెలలకే పుట్టిన శిశువుకి పునర్జన్మ

27-12-2025 01:17:36 AM

శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో విజయవంతంగా చికిత్స

హైదరాబాద్, డిసెంబర్ 26: కేవలం 28 వారాల కాలంలోనే (ఏడు నెలలకే) పుట్టిన ఒక అత్యంత ముందస్తు మగ శిశువుకు కొండాపూర్‌లోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ విజయ వంతంగా చికిత్స అందించి పునర్జన్మ ఇచ్చింది. ఆస్పత్రి అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ (ఎన్‌ఐసీయూ) సామర్థ్యాలను, నైతిక, సరసమైన చికిత్సా పద్ధతులను ఈ విజయం మరోసారి నిరూపించింది.

28 వారాల్లో పుట్టి న ఈ శిశువు కేవలం 900 గ్రాముల తక్కువ బరువుతో జన్మించి, తక్షణమే ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరమైంది. బయట ఆస్పత్రిలో జన్మించిన ఈ శిశువును ప్రత్యేక నియోనాటల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా సురక్షితంగా శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్‌కు తరలించారు.

శిశువును ఎన్‌ఐసీయూలో చేర్చి సమగ్రమైన వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ముందస్తు జననం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో, శిశువుకు మొదట వెంటిలేటర్ మద్దతు అవసరమైంది. నిరంతర పర్యవేక్ష ణలో క్రమంగా వెంటిలేటర్ సాయాన్ని తగ్గి స్తూ శిశువును సాధారణ శ్వాస తీసుకునేలా చేశారు. సుమారు 60 రోజుల పాటు ఎన్‌ఐసీయూలో ఉన్న ఈ శిశువుకు నిపుణుల బృం దం 24 గంటలూ సంరక్షణ అందించింది.

చికిత్స సత్ఫలితాలను ఇవ్వడంతో, ఎటువంటి ప్రధాన సమస్యలు లేకుండా శిశువు కోలుకున్నాడు. డిశ్చార్జ్ సమయంలో శిశువు బరువు 2 కిలోలకు చేరుకోవడం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ నియోనాటల్ కేర్ బృందం లో కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ ,పీడియాట్రిషియన్ డాక్టర్ జె సుభాష్ చక్రవర్తి, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ ఎస్‌ఎల్ నరసింహారెడ్డి ఉన్నారు. వీరు శిశువు ఆసుపత్రిలో ఉన్నం త కాలం శిశువు ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షించారు. 

ఈ కేసు గురించి మాట్లాడుతూ అత్యంత ముందస్తుగా జన్మించిన శిశువులకు సుదీర్ఘమైన, ప్రత్యేకమైన ఎన్‌ఐసీయూ సంరక్షణ అవసరమని వైద్యులు చెప్పారు. సరైన సమయంలో తీసుకురావడం, అత్యాధునిక నియో నాటల్ సపోర్ట్ అందుబాటులో ఉండ టం అనేది శిశువు ప్రాణాలను కాపాడటంలో దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలలో కీలక పాత్ర పోషి స్తుందని వారు వివరించారు.

ముఖ్యంగా, నైతికతతో కూడిన, అందుబాటు ధరల వైద్య సేవలపై తమ నిబద్ధతను ఆస్పత్రి చాటుకుం ది. మొత్తం నియోనాటల్ కేర్ను మార్కెట్లో ఉన్న ఖర్చులకంటే కంటే దాదాపు మూడవ వంతు తక్కువ ఖర్చుతోనే అందించారు. దీనివల్ల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండానే సామాన్య కుటుంబాలకు అత్యాధునిక ఎన్‌ఐసీయూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ‘ప్రాణాలు కాపాడే శిశు సంరక్షణ అనేది సాంకేతికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, ఆర్థి కంగా అందరికీ అందుబాటులో ఉండాలనే మా నమ్మకాన్ని ఈ కేసు ప్రతిబింబిస్తోంది’అని వైద్యులు పేర్కొన్నారు.