calender_icon.png 5 May, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం!

26-04-2025 12:00:00 AM

నేడు ప్రపంచ మేధోసంపత్తి హక్కుల దినోత్సవం

బుద్ధిబలం కంటే మించిన సం పద ఈ ప్రపంచంలో ఏదీ లే దు. దీనిని సరైన రీతిలో ఉపయోగించాలి. తన తప్పులను ఎదుటివారిపై నెట్టేసి, ఇతరులను ప్రమాదంలోకి పడేసే కుయుక్తుల ను మేధస్సు అనలేం. స్వార్థ, సంకుచితత్వాలతో కూడిన అతి తెలివితేటలు అనర్థానికి హేతువులు. అవసరానికి వాడుకుని వదిలేసే ప్రబుద్ధుల బుద్ధులు కడకు స్వీయ ప తనానికే దారితీస్తాయి. బుద్ధి క్షీణిస్తే పత  నం ప్రారంభమవుతుంది. ‘అదృష్టం అంద లం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి జారినట్టు’ మనముందున్న అవకాశాలను వదిలేసి, ఏదో సాధించాలని మూర్ఖంగా తపించడం అవివేకం అవుతుంది. మేధస్సు మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడాలి.

సమాజ హి తానికి ఉపయోగపడని జ్ఞానం వల్ల ఫలి తం లేదు. గ్రంథ పఠనం, స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానం అలవడుతుంది. అలా వచ్చిన జ్ఞానాన్ని దేశ హితం కోసం వినియోగించాలి. ఆలోచనల నుంచి ఆర్థిక జ్ఞా నం పొందాలి. సాధన ద్వారానూ జ్ఞానం లభిస్తుంది. మన మస్తిష్కాన్ని, మనసును ఒకేచోట కేంద్రీకరించి, పట్టుదలతో ప్రయత్నిస్తే, జ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రయత్నాలు లేకుండా బుద్ధి వికసించదు. మానసిక పరిపక్వత సాధ్యం కాదు. 

ఈ ప్రపంచంలో జ్ఞానానికి సరితూగే ధ నం లేనే లేదు. మేధస్సు మానవులకు ల భించిన ఒక వరం. ఇతర జీవరాశుల కంటే భిన్నంగా జీవించాలనే తత్వం, ఆలోచన, విషయ సేకరణ, ఆచరణ వంటి విశిష్టమైన లక్షణాలు మానవజాతిలో మెండుగా ఉన్నాయి. ఇతర జీవరాశులకు తెలివితేట లు లేవని అనుకోవడం అజ్ఞానం వల్ల జ నించిన భావన మాత్రమే. మనతో మమేకమై జీవించే కోటానుకోట్ల జీవరాశులలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. సాలె పురుగు క్షణాల్లో నిర్మించుకునే ఒక రక్షణ వలయం ఒక అద్భుతమైన ఇంజినీరింగ్ నై పుణ్యాన్ని సూచిస్తుంది. విచిత్రమైన సాలె పురుగు రక్షణ నిర్మాణం మానవులకు కూ డా సాధ్యం కాని విషయం.

పక్షి ఏర్పరచుకునే గూడును ఒకసారి పరిశీలిస్తే దాని తె లివితేటలు, పనితనం అవగమవుతాయి. జంతువులు తమను తాము ఇతర బలమై న మృగాల నుంచి కాపాడుకోవడానికి, ఆ హారం కోసం ఎన్నో వ్యూహాలను సిద్ధం చేసుకుంటాయి. మొక్కలకు కూడా ప్రా ణం, స్పందించే గుణం ఉందన్న విషయా న్ని ప్రముఖ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ఏనాడో నిరూపించాడు. ఆపద సమయం లో కొన్ని జాతుల మొక్కలు తమ రక్షణ వ్యూహాలను అమలు పరుస్తాయి. పాము లు, తేళ్లు, తాబేళ్లు వంటి ప్రాణులు ప్రమా ద సమయంలో తమను తాము ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయో మన కు విధితమే. అయితే, జీవరాశులన్నీ తమ మనుగడ కోసం అవరసమైనంత మేరకే తమ శత్రువులపట్ల జాగరూకత వహిస్తాయి. పశుపక్షాదుల్లో లేని అవలక్షణాలు స్వార్థం, అసూయలు మనిషిలో ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు పట్టిన దరిద్రం.

పట్టిన గ్రహణం వీడాలి!

అవసరం లేకపోయినా దురాశతో తో టి మనుషులను పీడించడం, భూప్రపం చం ఉన్నంత వరకు  బతికేయాలనే అత్యాశతో తరతరాలకు తరగని సంపదను కూ డబెట్టే అనైతిక ప్రక్రియలో భాగంగా స్వజాతిపట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించ డమనేది మానవ మేధస్సుకు గ్రహణం లాంటిది. ఈ ధోరణి మారాలి. మన ఆలోచనలు, ప్రతిభ, వ్యక్తిగత గుర్తింపునకు, గౌరవానికి తోడ్పడటంలో తప్పు లేదు. అయితే, అంతిమంగా మన మేధస్సు స మాజానికి ఉపయోగపడాలి. ఒకరి ఆలోచనలను, ప్రతిభను బలవంతంగా లాక్కునే పద్ధతి మారాలి. మేధోమథన ఫలాలు ప్రపంచాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాయి. మస్తిష్కంలోని ఆలోచనలు, ఆసక్తు లకు సాధన తోడై దానికి ప్రయోగాత్మక పరిశీలనా దృక్పథాన్ని రంగరిస్తే అమూల్యమైన జ్ఞానసంపద  వెలువడుతుంది.

అ లాంటి జ్ఞానాన్ని పదును పెడితే ఒక మహత్తరమైన ఆవిష్కరణకు రూపకల్పన జరు గుతుంది. ఇది ప్రపంచానికి, దేశానికి ఎం తో ఉపయుక్తకరమైన అంశంగా మారుతుంది. ఒక సకారాత్మక దృక్పథంతో కార్య సాధన చేసి, మానవ మేధస్సు ద్వారా అ ద్భుత ఆవిష్కరణను సమాజానికి అందిస్తే అదే నిజమైన ఆస్తిగా తరతరాలకు ఉపయోగపడుతుంది. అదే ప్రపంచానికి నిజ మైన వారసత్వ సంపద. జ్ఞానం నుంచి వె లువడిన సంపదను మేధోసంపదగా అభివర్ణించవచ్చు. పూర్వకాలంలో తెలివితేట లను కొంతమందికే పరిమితం చేసేవారు. మేధావులు తమ తెలివికి సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకునే వా రు కాదు. కేవలం తమ కుటుంబాలకే పరిమితం చేసేవారు.

కొంతమంది తెలివితేట లను ఈ సమాజం బలవంతంగా అణచివేసింది. ఇలాంటి అసూయవల్ల అనర్థాలే తప్ప సమాజానికి మేలు జరగలేదు. ఈ సత్యాన్ని ప్రపంచ దేశాలు గ్రహించాయి. అందుకే తమ దేశ పౌరుల ఆలోచనలను, తెలివితేటలను విరివిగా వినియోగించుకు ని, ఇతర దేశాల మేధస్సును దొంగిలించి, అది తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటుండటాన్ని చూస్తున్నాం. ఇలాంటి క్రమంలోనే భారతదేశం తన విలువైన మేధో సంపత్తిని విదేశాలకు ధారాదత్తం చేసింది. తెరవెనుక కుట్రను గ్రహించక తన జ్ఞానసంపదను బాహ్య ప్రపంచానికి తెలపడంలో విఫలమైంది. భారతీయ సాంప్ర దాయాల్లో నిక్షిప్తమైన అనేక శాస్త్రీయ ఆలోచనలు మూఢ నమ్మకాల ముసుగు లో మూలన పడిపోతే, వాటిని తెలివిగా ఒ డిసి పట్టుకుని పేటెంట్ హక్కులు సంపాదించి, వాటి ఫలితాలను తిరిగి ప్రపంచ దే శాలకు అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలను చూస్తూ మన దేశం నిస్సహాయత వ్యక్తం చేసింది. 

కృషికి తగిన గుర్తింపు దక్కాలి

మన దేశంలో ఎంతోమంది శాస్త్రవేత్త లు తమ పరిశోధనలతో ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. కానీ, వారి కృషికి తగిన గుర్తింపు లభించడం లేదు. ప్రాచీన నాగరికతకు భారతదేశం పుట్టిల్లు. సైన్స్ అంటే ప్రపంచానికి తెలియని రోజుల్లో చరకుడు, సుశ్రుతుడు వైద్యశాస్త్ర రంగంలో అబ్బుర పరిచే అనేక ఆవిష్కరణలను ప్రపంచానికి అందించారు.  క్రీస్తుపూర్వమే సుశ్రుతుడు తొలి శస్త్రచికిత్స చేసి ఆశ్చర్యపరిచాడు. ఆ యన అద్వితీయ వైద్య పరిజ్ఞానానికి గౌరవంగా మెల్‌బోర్న్‌లో సుశ్రుతుని విగ్రహా న్ని ఏర్పాటు చేశారు. కానీ, మన దేశంలో ఆయనకు లభించిన గౌరవం ఏమిటి? కనీ సం ఆయన పేరుకూడా నేటి చాలామంది భారతీయులకు తెలియదు. భారతీయ సం ప్రదాయంలో పసుపును చర్మ సౌందర్యానికి వినియోగిస్తారు.

అయితే జ్ఞానాన్ని మ న నుంచి విదేశీయులు తస్కరించి పేటెంట్ హక్కులు పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గణిత మేధావులకు సైతం అ ర్థం కాని సమస్యలకు పరిష్కారం చూపిన భారతదేశ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌కు ఎందుకు నోబెల్ బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన రామానుజన్‌కు కనీసం ఆయన మరణానంతరం కూడా మనం భారతరత్న అవార్డునిచ్చి ఎందుకు సత్కరించుకోలేక పోయామనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ప్రపంచంలోని మేధావులు ఆవిష్కరించిన ఫలితాలను గుర్తించి వారికి పేటెంట్ హక్కులు కల్పించడం ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. వ్యాపారాభివృద్ధికి, నాణ్యతకు వివిధ రకాల ట్రేడ్‌మార్క్‌లను ప్రకటించడం.. పేటెంట్, కాపీరైట్ చట్టాలపట్ల అవగాహన కలిగించడానికి ఏటా ఏప్రిల్ 26న ‘ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని’ నిర్వహించుకుంటున్నాం. 

వరల్డ్ ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్లూఐపీఓ) 1970లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మేధోసంపత్తికి సం బంధించిన విలువలను చాటి చెప్పి, దాని విధానాలను వివరించడం, సేవ, సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతో ఏర్పా టైన ఈ సంస్థ మేధావుల ఆలోచనలను ఆర్థిక రూపంలోకి మార్చి ప్రజలకు ఉపకరించే విధంగా సరికొత్త రూపకల్పనలు చేసేలా ప్రోత్సహించాలి.  మన దేశ పాలకులు ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.

వ్యాసకర్త: సుంకవల్లి సత్తిరాజు, సెల్: 9704903463