calender_icon.png 7 August, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"గద్దర్ అడుగుజాడల్లో నడుద్దాం"

06-08-2025 11:47:21 PM

సిద్ధిపేట క్రైమ్: ప్రజాయుద్ధనౌక గద్దర్ అడుగుజాడల్లో నడుద్దామని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరియాదవ్, వైస్ చైర్మన్ ఆస లక్ష్మణ్ ల పిలుపునిచ్చారు. గద్దర్ రెండో వర్ధంతి సందర్బంగా బుదవారం సిద్దిపేట జిల్లా(Siddipet District) కేంద్రంలోని పొన్నాల వై జంక్షన్ వద్ద ప్రతిపాదిత విగ్రహ నిర్మాణం స్థలంలో సభ నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక శక్తులు, గద్దర్ అభిమానులు హాజరయ్యారు. సభకి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనుకరాజు హాజరై విగ్రహ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

సభనుద్దేశించి పోచబోయిన శ్రీహరియాదవ్, ఆస లక్ష్మన్ మాట్లాడుతూ, సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చిన అన్ని దళిత, బహుజన ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, ఉపాధ్యాయ ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేటతో గద్దర్ కు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. సమావేశంలో జర్నలిస్ట్ నాయకులు రంగాచారి, బోయ రాములు, టీపీటీఎఫ్ అసోసియేట్ అధ్యక్షులు గాడిపల్లి తిరుపతిరెడ్డి, సత్తయ్య, అవని సంపాదకులు రాజిరెడ్డి, దళిత ప్రజా సంఘాల నాయకులు గ్యాదరి రామస్వామి, పంబాల ఎల్లయ్య, తుమ్మ శ్రీనివాస్, మేరుగు మహేష్, అందె ప్రవీణ్, గ్యాదరి జగన్ ముత్యాల కనుకయ్య, సందులాపురం కనుకయ్య, బెల్లే రాములు, సుకూరి ఎల్లయ్య, దేవర ఎల్లం, పోతుల మోహన్, మెరుగు బద్దిరాజు ఆస బాబు, బీసీ సంఘాల నాయకులు పయ్యావుల రాములు యాదవ్, మామిళ్ల ఐలయ్య యాదవ్ కోరి ఎల్లయ్య కురుమ, కుమ్మరి సంఘం నాయకులు శ్రీను, బొల్లు రాము యాదవ్,  కోరే ఎల్లయ్య కుర్మ, గంగిరెద్దుల సంఘం అధ్యక్షులు జిడ్డి కనకయ్య, నాయకం లక్ష్మణ్, పోలీసు రాజులు, పద్మశాలి సంఘం నాయకులు డాక్టర్ సతీష్, బూర మల్లేశం, బొల్లు రాము యాదవ్ పాల్గొన్నారు.