08-01-2026 12:50:53 AM
రవితేజ కథానాయకుడిగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కథనాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. “ఈసారి పండక్కి సరదాగా గోల గోల చేద్దాం. ఇదొక్కటే కాదు.. వస్తున్న అన్ని సినిమాలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం” అన్నారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అద్భుతమైన జర్నీ.
జనవరి 13న ఈ సినిమా విడుదలవుతోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చూడాలని కోరుకుంటున్నా” అని తెలిపింది. ‘రవితేజతో ఇది నాకు రెండో సినిమా. నా మొదటి సంక్రాంతి సినిమా. అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నా’నని డింపుల్ హయాతి చెప్పింది. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫన్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా’ అని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు.