calender_icon.png 9 January, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెట్టింపు ఆనందంతో బయటకొస్తారు

08-01-2026 12:53:59 AM

ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “రాజాసాబ్’ షూటింగ్ కోసం వేసిన ఈ సెట్ మాకు మరో ఇల్లులా మారింది. చాలా రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేశాం. ఇంత సరదాగా మరే మూవీ సెట్‌లోనూ మేము గడపలేదు. ఈ సినిమా చేశాక నేనూ డార్లింగ్ ఫ్యాన్ అయిపోయా. నా కెరీర్‌లో రాజాసాబ్ ఒక స్పెషల్ మూవీ” అన్నారు. హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడుతూ “రాజాసాబ్.. రొమాన్స్, యాక్షన్, హారర్ ఎలిమెంట్స్ తో మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇలాంటి కంటెంట్‌ను మీరెప్పుడూ చూసి ఉండరు.

ఈ చిత్రంలో నటించిన ప్రతి మూవ్‌మెంట్ ఎంజాయ్ చేశాం” అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “హారర్ ఫాంటసీ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రభాస్‌ని ఎలా చూడాలని అంతా అనుకున్నారో అలా ఈ సినిమాలో కనిపిస్తారు. ప్రేక్షకులు ఎంత ఎనర్జీతో సంతోషంతో థియేటర్ లోపలికి వెళ్తారో, అంతకంటే రెట్టింపు ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని బయటకు వస్తారు” అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మూడేళ్ల క్రితం రాజాసాబ్ జర్నీ మొదలైంది. మొదట హారర్ కామెడీ చేయాలని అనుకు న్నాం.

ఆ తర్వాత మ రింత స్కేల్ పెంచి హారర్ ఫాంటసీగా మార్చాం. భారీ సె ట్స్ నిర్మించాం. ఇ ప్పటిదాకా మన ఇండియన్ సినిమాలో ఇంత హ్యూజ్ హారర్ ఫాంటసీ మూవీ రాలేదు. ఒక ప్రెస్టీజియస్ మూవీగా రాజాసాబ్‌ను ప్రొడ్యూస్ చేయడంలో మేము సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఈ మూవీ కథలో బాగా కుదిరాయి. అన్ని ఎలిమెంట్స్ మూవీలో బ్యాలెనస్డ్‌గా ఉంటాయి” అని తెలిపారు. ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడారు.