22-08-2025 11:37:38 PM
సిద్దిపేట క్రైమ్: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, సిద్దిపేటను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందామని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో యువతను ప్రోత్సహించే విధంగా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ ను ముండ్రాయి గ్రామంలో రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ టోర్నీలో 24 క్రికెట్, 10 వాలీబాల్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను వివరించారు. మాదకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.