calender_icon.png 14 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యంగా ముందుకు సాగుదాం

14-07-2025 12:43:00 AM

- లక్ష్యానికి అనుగుణంగా పని చేద్దాం 

-రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష బీసీ రాజకీయ నేతలు 

మహబూబ్ నగర్ జూలై 13 (విజయ క్రాంతి) : ఐక్యంగా ముందుకు సాగుతూ ల క్ష్యానికి అనుగుణంగా పని చేద్దామని అఖిలపక్ష బీసీ రాజకీయ నేతలు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో మెట్టు కాడి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష బీసీ రాజకీయ నేత ల సమావేశంలో పలువురు నేతలు హాజరై ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ పార్టీ ఏదైనా ఎక్కడ ఉన్న బీసీ నినాదంతో ముందుకు సాగుదామని తెలియజేశారు.

ఎవరికి వారై ఉండి బీసీలు వెనుకబడి పోతున్నారని అందరూ కలిసి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేదించగల మన్నారు. బీసీ మహిళలు సైతం అధిక సం ఖ్యలో బయటికి వచ్చి ప్రత్యేక చర్చ కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం ఉందన్నా రు. అందరికీ అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఐకమత్యమే కరువవుతుందని, అది ఒక్కటి సాధిస్తే రాజకీయంగా గాని మరే ఇత ర పనుల్లోనైన బీసీలు విజయకేతనం ఎగరవేయడం తద్యమన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు , ఆర్డినెన్స్ ఆమోదం పై అం దరం సంతోషం వ్యక్తం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి సమావేశాలు అవసరం ఉన్న లేకపోయినా ప్రత్యే కంగా నిర్వహించుకొని పలు అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించాలని పలువురు నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశా రు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు బెక్కం జనార్ధన్, రాఘవేంద్ర రాజు, మెట్టు కాడి ప్రభాకర్, శివరాజ్,తదితర నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.