07-11-2025 12:30:21 AM
ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేత
భూత్పూర్ నవంబర్ 6 : సంచార జాతులైన మాదాసి మాదారి కురవలమైన మేము గొర్లను మేపుకుంటూ నదీ పరివాహక ప్రాంతాలలో గొర్ల గ్రాసం కొరకు వివిధ జిల్లాలు రాష్ట్రాలు సంచరిస్తూ గొర్లను మేపుకుంటూ తిరుగుతుండడంతో , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా జీవన విధానాన్ని బట్టి సంచార జాతులైన మాదాసి, మా దారి కురవలమైన మమ్ములను రాజ్యాంగంలో ఎస్సీ కులంలో చేశారని అధ్యక్షులు విజయకుమార్ తెలిపారు.
రాజ్యాంగం ప్రకారం అప్పట్లో మాకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు అయ్యేవి కానీ కాలక్రమేనా నిరక్షరాస్యులైన మా మాదాసి, మాదారి కురువలను అధికారులు కురుబ ,కురుమ పేర్లతో బిసి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అప్పటినుండి ఎస్సీ సర్టిఫికెట్ల కొరకై అటు రాజకీయ నాయకులకు గాని ఇటు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాం.
ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి సంచార జాతులైనటువంటి మాదాసి కురువ కులస్తులకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా కోరుతూ గురువారం భూత్పూర్ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మాదాసి మాదారి కురువ కులస్తులు పాల్గొన్నారు.