07-05-2025 12:00:00 AM
సీఐటీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్
యాదాద్రి భువనగిరి, మే 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్‌ల రద్దును కోరుతూ ఈనెల 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు. స్థానిక తిరందాసు గోపి మీటింగ్ హాల్‌లో జరిగిన సీఐటీయు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు హాజరై ప్రారంభించి మాట్లాడారు.
కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాండు, మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు పాషా, సోములు, జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ , సురేందర్ , సత్యనారాయణ, ఈశ్వర్ జిల్లా కమిటీ సభ్యులు గణపతి రెడ్డి, వెంకటేశం, యాదమ్మ, గణేష్, జహంగీర్, మాతయ్య, మధు, బిక్షం, నర్సింహ, మిషన్ భగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీను, ప్రిమియర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్, రేఖ, రాము, కృష్ణ పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెకు కార్మికవర్గం సిద్ధం కావాలి
చండూరు: బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున సిద్ధం కావాలని సిఐటియు జిల్లా నాయకులు ధనంజయ పిలుపునిచ్చారు. నాయకులు చిట్టిమల్ల లింగయ్య, వెంకటయ్య, లింగస్వామి, నాగరాజు, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.