04-12-2025 12:14:28 AM
కార్మికులకు ఏఐటీయూసీ నేత వెంకటస్వామి పిలుపు
‘విజయక్రాంతి’ కథనానికి కదలిక
బెల్లంపల్లి అర్బన్, డిసెంబర్ 3 : బెల్లంపల్లి శాంతిఖని మనుగడపై కమ్ముకున్న నీలి నీడలపై ‘శాంతిఖనికి ఓం శాంతి‘ అనే శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో నవంబర్ 24న వచ్చిన కథనానికి సింగరేణి గుర్తింపు ప్రధాన కార్మిక సంఘం ఏఐటీయూసీ నుంచి కదలిక వచ్చింది. ఈ మేరకు బుధవారం శాంతిఖనిలో ద్వారా సమావేశం నిర్వహించి గని మేనేజర్ కు శాంతిఖని గనినీ కాపాడాలని వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట స్వామి మాట్లాడుతూ శాంతిగనినీ కాపాడుకునేందుకు కార్మికులు సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి కంపనీ బెల్లంపల్లి ఏరియాలో 90 సంవత్సరాలు, సింగరేణి కంపనీకి సిరులు అందించిన శాంతిఖనిలో కొన్ని సంవత్సరాలుగా లాంగ్ వాల్ ప్రాజెక్టు పేరుతో పనులు ప్రారంభించారని తెలిపారు.
మొదట అండర్ గ్రౌండ్ లో టన్నల్ బెల్ట్ ఎరెక్షన్ యుద్దప్రతిపాదిక చేపట్టారని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యo, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారం పనులు నిర్వహించారా.. నిర్వహించలేదా..? అలాగే మొదట ఎస్ డి ఎల్ యంత్రాలతో, రెండోవది ఏ ఎం-50 లతో, మూడోవది సీ ఎం ఆర్ యంత్రాలతో ఈ ప్రాజెక్టులో ఏవి కూడా సక్సెస్ కాలేదని తెలిపారు. చివరగా బొల్టర్ మీషన్ (బీ ఎం) ప్రవేశపెట్టారన్నారు.
సింగరేణి అధికారుల పర్యవేక్షణ లోపంతో గతంలో ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఈ గనిలో పనిచేసిన అధికారుల తప్పిదాల వల్ల లూజు కోల్ తీశారన్నారు. అలాగే సింగరేణి కంపనీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడాలని చిత్తశుద్ధి అధికారులకు లేకపోవడం భావ్యం కాదన్నారు. కంపెనీ ప్రగతికి సింగరేణి అధికారులు సమన్వయంగా పనిచేయవలసిన అవసరాన్ని గుర్తించకపోవడంతో 28 రోజులుగా ప్రొడక్షన్ ఆగిపోయిందన్నారు.
గని పరిస్థితీపై కార్మికులు, కార్మిక కుటుంబాలు ఆందోళన పడుతున్నారన్నారు. కార్మిక వర్గానికి ఈ గని విషయంలో భరోసా కల్పించడంలో సింగరేణి అధికారులు చొరవ తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. శాంతిఖని గనిలో పనిచేస్తున్న మైనింగ్ అధికారులు, మెకానికల్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ గనికి నష్టం జరుగుతున్నదనీ వాపోయారు.
జే ఎం ఎస్ ప్రైవేట్ కంపెనీ అధికారులు సహకరించకపోవడం, సింగరేణి యాజమాన్యంతో ఈ ప్రైవేట్ కంపెనీకి టెండర్ షెడ్యూల్ లో ఉన్న టెరమ్స్ అండ్ కండిషన్స్ ను ఇంప్లిమెంట్ చేయకపోవడం, అధికారులు వారిపై కర్రపెత్తనం వల్ల ప్రైవేట్ కంపెనీకి సింగరేణి అధికారులకు సమన్వయం లోపించడంతో ఉత్పత్తి ఉత్పాదకత సాధించలేకపోతున్నామనీ తెలిపారు.
సింగరేణి ఉన్నత యాజమాన్యం ఈ ప్రాజెక్టు విషయంలో గతములో జరిగిన తప్పిదలను సరిచేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల తప్పిదల వల్ల జరిగిన నష్టంపై విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రగతి కోసం పనిచేయాలన్నా కన్సెప్ట్ తో పనిచేయాలనీ, కంపెనీ బాగుకోసం లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తున్న అధికారుల విధానాల వల్ల కంపెనీకి అపారమైన నష్టం జరుగుతుందనీ ఆరోపించారు.
సింగరేణి ఉన్నత యాజమాన్యం తక్షణమే లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలనీ, సింగరేణి కంపెనీలో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో బెల్ట్ ఎరెక్షన్ అనుభవం ఉన్న అధికారులను తక్షణమే తీసుకోరావాలనీ, సరిపడు మెటీరీయల్ సప్లయ్ చేయాలనీ కోరారు.
శాంతిఖని మైన్ లో ఒక టన్నుకు ఉత్పత్తి అయ్యే ఖర్చును తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. గనిలో సౌత్ సెక్షన్ లో పని స్థలాలను ఏర్పాటు చేసుకొని నాలుగు ఎస్ డీ ఎల్ లను ఏర్పాటు చేసి యాజమాన్యమే ఉత్పత్తి తీసుకోరావడానికి ప్రయత్నం చేయాలనీ కోరారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేశ్, ఏఐటియుసి సీనియర్ నాయకుడు చిప్ప నరసయ్య, ఫిట్ కార్యదర్శి తిరుపతి, అసిస్టెంట్ సెక్రటరీ మంతెన రమేష్, నాయకులు రత్నం ప్రవీణ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ పాల్గొన్నారు.