calender_icon.png 4 December, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌కు నేడు సీఎం రాక

04-12-2025 12:16:41 AM

  1. పట్టణంలో రూ.500 కోట్ల పనులకు శ్రీకారం...

ఇందిరా ప్రియదర్షిని స్టేడియంలో బహిరంగ సభ

ఆదిలాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన 2 ఏళ్ల విజయోత్సవ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన సందర్బంగా ప్రజాపాలన విజయోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో రూ. 500 కోట్లతో చేపట్టను న్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడి యం వేదిక కానుంది.

ఇక్కడి నుంచే వివిధ పనులకు సంబందించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించునున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పర్యవేక్షించారు. మరోవైపు సీఎం పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీఅఖిల్ మాహజన్ ఇప్పటికే సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన సం దర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటుచే పట్టారు.

శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు 

ఆదిలాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో యూఐడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనుండగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట గల స్థలంలో రూ.1.75 కోట్ల వ్యయంతో మహిళ సంఘం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐఓసీఎల్ పెట్రోల్ బంక్కు సీఎం భూమిపూజ చేస్తారు.

సీఎస్‌ఆర్ నిధులు కోటి రూపాయలతో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన, నూతన కలెక్టరేట్ భవనం వద్ద రూ. 2.31 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ క్వార్టర్లు, రూ.11.93 కోట్ల వ్యయంతో నిర్మించిన  క్వార్టర్లను ప్రారంభించనున్నారు.

రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన భరోసా సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని 160 ఎస్‌ఎల్‌ఎఫ్లకు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.19.69 కోట్ల చెక్కులను మహిళ సభ్యులకు అందజేయనున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి ఐఓసీఎల్ ప్రతినిధులు  మెప్మా మధ్య ఎంఓయూ ఆర్డర్ను అందజేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపారు.

700 మంది పోలీసులతో బందోబస్తు

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యం లో 700 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మూడంచల భద్రతతో పాటు బందోబస్తు మొత్తాన్ని 9 సెక్టార్లుగా విభజిం చారు.  హెలి ప్యాడ్, కాన్వాయ్, రూట్ బందోబస్తు, మీటింగ్ ప్లేస్, ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, పార్కిం గ్, ట్రాఫిక్, బాంబు స్క్వాడ్ బృందాలను నియమించామని ఎస్పీ వెల్లడించారు.