calender_icon.png 26 August, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పీఎంవో సమావేశం

26-08-2025 02:23:06 AM

  1. ట్రంప్ అదనపు సుంకాల నేపథ్యంలో భేటీ
  2. అధ్యక్షత వహించనున్న ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి!
  3. అమెరికా విధించిన 25 శాతం అదనపు సుంకాలు రేపటి నుంచే అమల్లోకి
  4. డీల్ ఎక్కడ బాగుంటే అక్కడ చమురు కొంటాం: రష్యాకు భారత రాయబారి వినయ్ కుమార్

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకును చూపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించారు. దీంతో సుంకాలు 50 శాతానికి చేరుకున్నా యి. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండగా.. అదనంగా విధించిన 25 శాతం సుంకాలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యం లో మంగళవారం ప్రధాని కార్యాలయం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి అధ్యక్షత వహించనున్న ట్టు సమాచారం. 

అగ్గువ ఎక్కడుంటే అక్కడ కొంటాం: వినయ్ కుమార్ 

అమెరికా అదనపు సుంకాలపై రష్యాకు భారత రాయబారి వినయ్ కుమార్ స్పందించారు. ‘అమెరికా నిర్ణయం అన్యాయం, అ హేతుకం, అసమంజసం. భారత్‌లో ఉన్న 1. 4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతే మాకు ముఖ్యం. ఉత్తమ డీల్ ఎక్కడ ఉన్నా భారత్ వ్యాపారం చేస్తుంది. భారత్ రష్యాతో మా త్ర మే కాకుండా మరిన్ని దేశాలతో కూడా వ్యా పారం చేస్తుంది. రష్యాతో భారత్ సహకారం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా, ఐరో పా దేశాలు కూడా రష్యాతో వాణి జ్యం కొనసాగిస్తున్నాయి. మా లక్ష్యం ప్రజల ప్రయోజ నాలు కాపాడటమే’ అని పేర్కొన్నారు. 

మార్గం కనుగొంటాం: మోదీ

అమెరికా వేసిన అదనపు సుంకాలపై సోమవారం ప్రధాని మోదీ స్పందించారు. ‘ఎంత ఒత్తిడి తెచ్చినా ఎదుగుతూ.. శక్తిని పెంచుకుంటూనే ఉంటాం. అదనపు సుంకాల నుంచి బయటపడేందుకు మార్గం కనుగొంటాం.  ప్రస్తుత రోజుల్లో ఆర్థిక స్వార్థంతో కూడిన పాలసీలను మనం చూస్తున్నాం. గాంధీ పుట్టిన గడ్డ మీద నుంచి మరోసారి మీకు మాటిస్తున్నా.. మా ప్రభుత్వానికి చిన్న పరిశ్రమల ప్రయోజనాలు ఎంతో ముఖ్యం. పశువుల పెంపకందారులకు, రైతులకు ఎటువంటి హాని కలగనివ్వం’ అని మోదీ పేర్కొన్నారు.