calender_icon.png 26 August, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులకు అస్వస్థత

26-08-2025 02:20:19 AM

- కామారెడ్డి జిల్లా షెట్లుర్ ప్రైమరీ స్కూల్‌లో ఘటనబిచ్కుంద ఆస్పత్రిలో చికిత్స 

-మధ్యాహ్న భోజన నిర్వాహకుల తొలగింపు

కామారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం షెట్లుర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం కారణంగా జరిగిందా లేదంటే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందా తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను విధుల్లో నుంచి అధికారులు తొలగించారు. మండల విద్యాశాఖ అధికారి విద్యార్థుల బాగోగులను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే  పరామర్శించారు.