02-09-2025 12:00:00 AM
నల్లగొండ క్రైమ్, సెప్టెంబర్ 1: భారతీయ జీవిత బీమా సంస్థ నల్లగొండ బ్రాంచ్ 1 కార్యాల యంలో సోమవారం 69వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐడిబిఐ నల్లగొండ బ్రాంచ్ మేనేజర్ సత్యవల్లి బాబు, నల్లగొండ బ్రాంచ్ 1 మేనేజర్ ఏ. వెంకటేశ్వర రెడ్డి లు ప్రారంభించి వారు మాట్లాడుతూ గత 69 సంవత్సరాలలో యల్.ఐ.సి. ఎంతో ప్రగతిని సాధించి పాలసీ దారులకు మెరుగైన సేవలందిస్తోంది అని కొనియాడారు.
69 ఏళ్ల కిందట అప్పటి భారత ప్రభుత్వం 1 సెప్టెంబర్ 1956న యల్.ఐ.సి. నీ జాతీయ కరణ చేశారని. ఇప్పటి వరకు యల్.ఐ.సి. నీతినిజాయితీగ పనిచేస్తునందులకు గర్విస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ యం.శ్రీనునాయక్, ఎల్‌ఐసి బ్రాంచ్ అధికారులు పుల్లెంల శ్యాంసుందర్ కుమార్,శర్వాణి,కరుణ, విస్తరణ అధికారులు యం.శ్రీనివాసులు, పి.హర్షవర్ధన్, వి.వెంకటేశ్వర్లు, వి.గురుమూర్తి, యం.వి.రమణారెడ్డి, యు.వి.రమణారెడ్డి, డి.రామారావు, కే.సురేష్, జే.బాలరాజు, సి.హెచ్. విజయ్ కుమార్, ఐసీఈయు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న,
వేముల కృష్ణయ్య, ఏజెంట్లు యూనియన్ ఏఓఐ నాయకులు నలపరాజు సైదులు, దేవేందర్, దారం వెంకన్న, లియాఫీ నాయకులు పుల్లెంల శ్రీనివాస్ గౌడ్, ఈదులకంటి యాదయ్య, ఎల్‌ఐసి బ్రాంచ్ స్టాఫ్ సభ్యులు, ఏజెంట్లు పాల్గొన్నారు.