calender_icon.png 29 January, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం..

29-01-2026 01:04:28 AM

సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ‘. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు పీ కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అశ్విన్ చంద్రశేఖర్ మ్యూజికల్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో విడుదల కానున్న.

ఈ సినిమా నుంచి ‘గాబరా గాబరా’ అనే పాటను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. ‘గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం.. కాలమే తన్నెరా లక్‌ని ఆమడ దూరం...’ అంటూ సాగుతోందీ గీతం. రాకేందు మౌళి రాసిన ఈ పాటకు ఆదిత్య రవీంద్రన్ స్వరపర్చగా, సంతోష్ నారాయ ణన్ పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: దినేశ్ పురుషోత్తమన్; ఆర్ట్: మైఖేల్ బీఎఫ్‌ఏ; ఎడిటర్: గణేశ్ శివ.