calender_icon.png 29 January, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలెత్తుకునేలా శ్రీ చిదంబరం గారు కథ

29-01-2026 01:06:23 AM

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన కొత్త సినిమా ‘శ్రీ చిదంబరం గారు’. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. నూతన దర్శకుడు వినయ్త్న్రం తెరకెక్కిం చిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ బచ్చిబాబు సానా బుధవారం విడుదల చేశారు.

ట్రైలర్‌ను గమనిస్తే.. ఇదొక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్ట్టోరీ అని తెలుస్తోంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ట్రైలర్ చివరలో ‘తల దించుకొని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడున్నా నన్ను తలెత్తుకొనీయమ్మా..’ అంటూ చిదంబరం చెప్పే డైలాగ్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంగీతం: చందు రవి; డీవోపీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి; ఎడిటర్: అన్వర్ అలీ; ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్లా.