29-08-2025 12:37:08 AM
ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : తెలంగాణ నేతన్న భద్రత పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.5 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేత కార్మికుల బీమా కోసం ఈ నిధులు మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.