23-09-2025 12:00:00 AM
నిర్మల్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా మామడ మండలం పొల్కల్ ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై సోమవారం పిడుగు పడింది. ఆలయ శిఖరంపై పిడుగు పడడంతో శిఖరం ధ్వంసమై కింద పడినట్టు గ్రామస్తులు తెలిపారు అనంతరం పూజారులు ఆలయం లో పూజలు నిర్వహించి శాంతి పూజ చేశారు.