calender_icon.png 23 September, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగులో మహిళ గల్లత్తు

23-09-2025 12:00:00 AM

బైంసా, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : భైంసా రూరల్ పరిధిలోని మాటేగాం గ్రామానికి చెందిన సురేష్, భిజ్జూర్ గ్రామానికి చెందిన   కంటోళ్ల లక్ష్మీబాయి శని వారం వాగులో గల్లంతయినట్టు స్థానికులు తెలిపారు యజమాని నగేష్ రెడ్డి  మేరకు వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండి, బర్రెతో పొలాలకు వెళ్తున్నాడు ఎడ్ల బండి పై వస్తానని చెప్పిన మహిళ లక్ష్మీబాయి వాగు దాటుతుండగా  ప్రమోద వశత్తు వాగులో పడి గలతే అయ్యింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ స్వయంగా వాగు ప్రాంతాన్ని సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంఘటన స్థలం చేరుకున్న ఆమె ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సం దర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ వర్షాల కారణంగా అనవసరంగా ఎవరు కూడా బయటకు రావొద్దని, వాగులు వంక లు దాటే ప్రయత్నం చేయరాదని, ముఖ్యం గా వ్యవసాయ రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన సందర్శనలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ నైలు, సమ్మయ్య, ఎస్‌ఐ, సిబ్బంది ఉన్నారు.