calender_icon.png 18 August, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ః సీఐ

18-08-2025 12:28:05 AM

నకిరేకల్, ఆగస్టు 17 : గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కొండల్ రెడ్డి అన్నారు.లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారం తో  కట్టంగూర్ మండలం లోని ఈదులూరు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ వైద్య శిబిరంను సీఐ కొండల్ రెడ్డి సూర్యాపేట కంటి ఆసుపత్రి ఛెర్మైన్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా సీఐ కొండల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజకలకు సేవలు అందిచడంలో లయన్స్ క్లబ్ లు ముందండం  అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. 

ఈ కార్యక్రమం లో  జిల్లా జి ఎం టి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, పటేల్ నరసింహారెడ్డి, జోన్ చైర్మన్ బుడిగ శ్రీనివాసులు, డిసీ మెంబర్ డెంకల సత్యనారాయణ, ఎర్ర శంబులింగారెడ్డి, క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్,కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరు వెంకటేశ్వర్లు,సహాయ కార్యదర్శిబసవోజు వినోద్, సభ్యులు తవిడబోయిన నరసింహ, జిల్లా ఉపేందర్, కక్కిరేని నవీన్, రాపోల్ వెంకటేశ్వర్లు, ఆకవరంబ్రహ్మచారి,నకిరేకంటి శంకర్, పున్న సుందర్, చెరుకు శ్రీనివాస్,కంటి హాస్పిటల్ విజన్ టెక్నీషియన్ బంగారు స్వాతి, క్యాంప్ ఇంచార్జి  బాణాల వీరేంద్ర చారి  గ్రామస్థులు పాల్గొన్నారు.