18-08-2025 12:30:26 AM
సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే కనీస అరత లేదనీ 10 సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజలకు చేసింది ఏమీ లేదనీ నారాయణపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కరెంటోతు శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన అభివృద్ధి నిధులను తాను తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క శాఖకు ప్రత్యేకంగా ఒక మనిషిని కేటాయించి మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే యజ్ఞాన్ని రాజగోపాల్ రెడ్డి చేపట్టారనీ అన్నారు ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి కరంతోత్ బిక్షపతి నాయక్, డిసిసి కార్యదర్శి ఏపూరి సతీష్, నోముల మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ వాంకుడు బుజ్జి నాయక్ ,మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి, దోనూరు జైపాల్ రెడ్డి, కొండ్రెడ్డి నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి, బాలగోని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.