calender_icon.png 2 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మద్యం దుకాణాలు బంద్

02-10-2025 01:54:54 AM

  1. ముందు రోజే భారీగా మద్యం కొనుగోళ్లు 

బుధవారం ఒక్కరోజే 300కోట్లకుపైగా విక్రయాలు? 

అంచనా వేసిన ఆబ్కారీ శాఖ

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో దసరా పండుగ శోభ సంతరించుకుంది. పర్వదినం జరుపుకునేందుకు నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంతూర్లకు చేరుకుంటున్నారు. అయితే, ఈ ఏడాది గాంధీ జయంతి రోజే (అక్టోబర్ 2న) దసరా పండుగ వచ్చింది. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలను రాష్ర్ట ప్రభుత్వం మూసివేస్తుంది.

దీంతో పండగ వేళ మద్యం, మాంసాహార ప్రియులకు షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే, రేపటి కోసం కొంతమంది బుధవారం మద్యం షాపుల ముందు బారులుదీరారు. ప్రధానంగా నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి.

గాంధీ జయంతి ఎఫెక్ట్‌తో బుధవారం దాదాపు 300 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అంచనా వేసింది. మంగళవారం మాత్రం రూ. 270 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు.