calender_icon.png 11 September, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

11-09-2025 01:09:25 AM

  1. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ 

సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత

గద్వాల, సెప్టెంబర్ 10 ( విజయక్రాంతి ) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను గద్వాల జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత అన్నారు. బుధవారం తమ ఛాంబర్ లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ పై విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ,లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించబడతాయన్నారు.సెప్టెంబర్ 13న శనివారం,గద్వాల్ లోని న్యాయస్థాన ప్రాంగణంలో లోక్‌అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాజీ పద్దతిలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,అన్నిరకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకుని తమ సమయాన్ని,డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు.గతంలో 8195 కేసులు పరిష్కరించి మన జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు.లోక్ అదాలత్ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుందని,

ప్రజలు తమ సమస్యలను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంప్రదించవచ్చని, అథారిటీ వారు ఉచిత న్యాయవాదిని అందించి, పూర్తిగా ఉచితంగా సమస్య పరిష్కారానికి తగిన న్యాయ సహాయం కల్పిస్తారని తెలిపారు. జిల్లా ప్రజలంతా తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకొని శాంతియుతంగా జీవించాలని ఆమె కోరారు.