26-11-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, నవంబర్ 25 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేయకూడదని, ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం లోబడి ఉంటే వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం చిల్పూర్ మండలం రాజవరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్బంగా నిర్వాహకులు రిజిస్టర్ లను సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేసారు. ధాన్యం సేకరణ పూర్తికాగానే వెంటనే ట్యాబ్ లో ఎంట్రీ చేసి రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాలో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. ఇప్పటివరకు 1,644 మంది రైతులకు 3.21 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు క్రెడిట్ అయ్యయన్నారు. ఈ కార్యక్రమం లో మండల తహసీల్దార్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.