24-07-2025 06:02:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలం విద్యాశాఖ అధికారిగా కౌట్ల ఉన్నత పాఠశాల పీజీ హెడ్మాస్టర్ మహేందర్ ఇంచార్జ్ బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఎంఈఓగా విధులు నిర్వహించిన మధుసూదన్ ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో సీనియర్ ప్రతిపాదికన మహేందర్ కు మండల బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.