23-04-2025 12:00:00 AM
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అనురాగ్ జయంతి మీడియాతో మా ట్లాడారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలిం గ్ జరగనుందని తెలిపారు.
మొత్తం 112 మంది ఓటర్లకు గానూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఒక్కో పో లింగ్ కేంద్రంలో నలుగురు చొప్పున సిబ్బం ది ఉంటారని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పా ట్లు చేశామన్నారు.
500 మంది అధికారులు, సిబ్బంది ఎలక్షన్ విధులు నిర్వర్తిసు న్నారన్నారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ రవి పాల్గొన్నారు.