11-07-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్, జూలై 10 : 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రసిడెంట్ దేవి రవీందర్, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 15న ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల మహాధర్నా పోస్టరును గురువారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఆవిష్కరించి మాట్లాడారు.
ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్- స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మపలికి బీ సీ లఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కారని పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి మొత్తం జనాభా సర్వే నిర్వహించాలని 33% శాతం మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళలకు అవకాశం కల్పించాలని అన్నారు.
ఈనెల 15న బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో చేపట్టే మహా ధర్నాకు బీసీ బిడ్డలు వార్డ్ మెంబర్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ ల వరకు రాష్టం లోని అన్ని రాజకయపార్టీలు అన్ని సంఘాలు పెద్దయెత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనగల్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కడారి కృష్ణ, మాజీ కౌన్సిలర్ దండంపెల్లి సత్తయ్య, చింతల యాదగిరి, నల్లగొండ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నారగోని నరసింహ, తదితరులు పాల్గొన్నారు.